పవన్ సినిమా రీమేక్ లో హీరో సుదీప్
- November 21, 2015
కన్నడలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరో పవన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సుదీప్. తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు హీరోలుగా తెరకెక్కిన సినిమా గోపాల గోపాల. దేవుడి మీదే కేసు వేసే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సుదీప్, ఈ సినిమాలో పవన్ పాత్రలో సుదీప్ నటిస్తుండగా వెంకటేష్ కనిపించిన పాత్రలో విలక్షణ నటుడు ఉపేంద్ర అలరించనున్నాడు. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో హిట్ అయిన గోపాల గోపాల, శాండల్ వుడ్ లో కూడా సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







