విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న నటి లక్ష్మి

- January 13, 2018 , by Maagulf
విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న నటి లక్ష్మి

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి, నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. టీచ్ ఫర్ ఇండియా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జంటనగరంలో 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు మంచు లక్ష్మి నివాసానికి చేరుకొని సందడి చేశారు. ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతోపాటు, టీచ్ ఫర్ చేంజ్ వాలంటీర్లకు మంచు లక్ష్మి సంక్రాంతి విందు భోజనాన్ని వడ్డించారు. ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లి వేడుక  జరుపుకునేవారమని, ఈ సంక్రాంతికి తన నివాసంలో సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పేద, ధనిక అంతరాన్ని విద్యార్థుల్లో రానివ్వకుండా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. తద్వారా పిల్లల్లో స్పూర్తి కలగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకుడు చైతన్యతోపాటు 25 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com