సినీపరిశ్రమలో అవకాశాలు రాకపోవటంతో మోసాలు చేస్తున్న సినీ నటి శ్రుతి..!
- January 13, 2018
ఫేస్బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కి సంబంధించిన వివాదాలు, కేసులు, మోసాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇటివల వెలుగులోకి వచ్చిన శ్రుతి కేసు కూడా ఫేస్‌బుక్‌కి సంబంధించినది కావడం విశేషం.
సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవటంతో పలువురు యువకులను టార్గెట్ చేసి శ్రుతి మోసం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఫేస్బుక్లో తన అందమైన ఫోటోలు పెట్టి రూ.1.50 కోట్లు దొచుకొని తన కుంటంబ సభ్యులతో జైలు జీవితం గడుపుతుంది. కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి ఆడి పోనాల్ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతుంది.
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన బాలకృష్ణన్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతన్ని శ్రుతి ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెడుతూ, ఇంగ్లిషులో మాట్లాడుతూ బాలకృష్ణన్ ప్రేమలోకి దించింది. బాలకృష్ణన్ పెళ్లి ప్రస్థావన తీసుకురావటంతో దీనిని అవకాశంగా తీసుకున్నది శ్రుతి. తన తల్లికి ఆరోగ్యం బాగలేదని ఆపరేషన్ చేయించాలని బాలకృష్ణన్ దగ్గర నుంచి రూ. 5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిపై అప్పు ఉందని ఈ పరిస్థితులో పెళ్లి చేసుకొలేని చెప్పటంతో శ్రుతికి రూ. 45 లక్షలు పంపాడు బాలకృష్ణన్.
శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపడంతో, వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని, ఎనిమిది మంది యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్ వెంటనే శ్రుతికి ఫోన్ చేసి నిలదీయడంతో కట్ చేసి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్ క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రుతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపాట్టారు. చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్‌కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, బంధువు వెంకటేష్ , స్నేహితుడు శబరినాథ్ లను కూడా సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







