హీరో అడివి శేష్ 'గూఢచారి' ఫస్ట్ లుక్ విడుదల...
- January 13, 2018
క్షణం, అమీ తుమీ హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార‍్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్‌లో గూఢచారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా