ఆలూ పోహ

ఆలూ పోహ

కావలసిన పదార్థాలు:
 
పోహ(అటుకులు): రెండు కప్పులు, ఆవాలు: టేబుల్‌ సూ ్పను, పచ్చిమిరపకాయలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి(సన్నని ముక్కలు చేసుకోవాలి), బంగాళాదుంప: ఒకటి(సన్నగా ముక్కలు చేసుకోవాలి), వేరుశనగపప్పు: పావుకప్పు, పచ్చిశనగపప్పు: టేబుల్‌స్పూను, పసుపు: చిటికెడు, నిమ్మరసం: టేబుల్‌ స్పూను, కొత్తిమీర: కొద్దిగా, సన్న కారప్పూస: ఐదు లేక ఆరు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు,
 
తయారీవిధానం: మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయల ముక్కలు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేసి బాగా వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలు, బంగాళాదుంప ముక్కలు పసుపు వేసి కొద్ది సేపు వేయించాలి. ఇవి బాగా ఉడికిన తరువాత అటుకులు కూడా వేసి సన్నని మంట మీద బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తరువాత నిమ్మరసం, ఉప్పు, సన్న కారప్పూస వేసి ఒకటి రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి దింపేయాలి. దింపే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Back to Top