కతార్ పడవ సంబరాలలో భద్రతను గురించి ప్రచారం చేసిన కుల్లునా
- November 21, 2015
కతార్ దేశంలో హమద్ మెడికల్ కార్పోరేషన్ వారి హమద్ అంతర్జాతీయ శిక్షణా కేంద్రం (HITC )వారు, కోనోకో ఫిలిప్స్ కతార్ వారు వ్యవస్థాపక పోషకులుగా స్థాపించిన జాతీయ ఆరోగ్య, భద్రత మరియు అవగాహనా ప్రచార కార్యక్రమం - కుల్లునా, లుసైల్ పట్టణంలో మౌర్జాన్ మరినాస్ లో జరిగిన కతార్ ఇంటర్నేషనల్ బోట్ షో -2015 లో విచ్చేసిన వేలాదిమంది సందర్శకులకు, వరుసగా మూడవ సంవత్సరం కూడా ఇళ్ళు, జలాశయాలు మరియు బోట్ లలో భద్రతను గురించి ప్రచారాన్ని నిర్వహించారు. మనందరం పెద్దగా పట్టించుకోని నీరు అనే అంశం కూడా, దురదృష్టవశాత్తు ఒకోసారి పిల్లల పాలిట ప్రమాదకరం కావచ్చు. రెండు నిముషాల వ్యవధిలో, ఐదు క్యూబిక్ సెంటిమీటర్ల నీటిలో చిన్నారులు మునిగిపోవచ్చు; ఐతే నీటి వలన సంభవించే ప్రమాదాలను ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా నివారించవచ్చు అని HITC డైరక్టర్ డా.అబ్దుల్ నూర్ సైఫెలదీన్ ఈ సందర్భంగా వివరించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







