'చీకటిరాజ్యం': రివ్యూ
- November 21, 2015
దశాబ్దాలుగా భిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు కమల్ హాసన్. కమర్షియల్ ఫీట్లను వదిలేసి....కథలో కొత్తదనాన్ని ఎంచుకుంటూ తన బ్రాండ్ ను కాపాడుకుంటున్నాడు. ఇలా కమల్ చేసిన మరో ప్రయత్నమే చీకటి రాజ్యం. హాలీవుడ్ ఫిల్మ్ స్లీప్ లెస్ నైట్ కథకు రీమేక్ గా దర్శకుడు రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐతే....రీమేక్ సినిమాల్లో సాధారణంగా ఎదురయ్యే నేటివిటీ సమస్య చీకటి రాజ్యానికి కొంత వరకు ఎదురైంది. కథ... నిజాయితీగా పనిచేసే నార్కోటిక్ బ్యూరో అధికారి కమల్ హాసన్. ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్ స్మగుల్ చేస్తున్న డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుకుంటాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న ఈ విలన్ గ్యాంగ్...కమల్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. పట్టుకున్న డ్రగ్స్ తిరిగి ఇవ్వకుంటే వారసుడిని చంపేస్తామని బెదిరిస్తారు. స్మగ్లర్లకు తిరిగి డ్రగ్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు కమల్. ప్రకాష్ రాజ్ గ్యాంగ్ కు ఈ డ్రగ్స్ అందించే క్రమంలో అది ఎన్ని మలుపులు తిరిగిందన్నది కథలోని ట్విస్ట్. చీకటి రాజ్యంలో ఎలాంటి వ్యవస్థ పనిచేస్తుందో అన్న అంశాలతో ఆసక్తికరంగా ముగుస్తుంది చిత్ర కథ. విశ్లేషణ.. భిన్నమైన క్యారెక్టర్లు కమల్ కోసం పుడతాయో...లేక కథను బాగా ఒంటబట్టించుకుని....అంతలా పాత్రలో ఒదిగిపోతాడో తెలీదు గానీ....చీకటి రాజ్యంలో కమల్ హాసన్ మరో సారి తన నటనా ప్రతిభను చూపాడు. అత్యంత సహజంగా దివాకర్ పాత్రను పోషించాడు. నార్కొటిక్ బ్యూరో ఆఫీసర్ గా త్రిష బాగా నటించింది. ఈ బ్యూటీ చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. ఇక కామెడీ విలనీ చేయడంలో ప్రకాష్ రాజ్ తన టాలెంట్ చూపించాడు. జిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. హాలీవుడ్ ఫిల్మ్ స్లీప్ లెస్ నైట్స్...ఆధారంగా చీకటి రాజ్యం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాజేష్. చాలా రీమేక్ సినిమాల్లాగే చీకటి రాజ్యం సినిమాకు నేటివిటీ సమస్య ఎదురైంది. ఫ్యూర్ థ్రిల్లర్ కథకు...మనకు నచ్చేలా కామెడీ ఫ్లేవర్ కలపడంతో మూల కథలో ఏదో తేడా అనిపిస్తుంటుంది. ఐనా...క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్ సినిమాను నిలబెట్టింది. ఫ్లస్ పాయింట్స్ కమల్ హాసన్ ఫర్మార్మెన్స్ స్క్రీన్ ప్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ లోని స్లో నెరేషన్ ఎడిటింగ్.
ఈ సినిమా కి మాగల్ఫ్.కాం వారి రేటింగ్ : 2.5/5
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







