నాతో సినిమా చేయాలంటే షరతులు వర్తిస్తాయి!
- January 13, 2018
ఇకపై నిబంధనలు వర్తిస్తాయి(కండిషన్స్ అప్లై) అంటోంది నటి నయనతార. నటిగా ఒకప్పటి స్థాయి వేరు ఇప్పటి నయన్ స్థానం వేరు. ఆదిలో నటిగా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇమేజ్ను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. మొదట్లో దర్శకుల సూచనలతో నటించేవారు. అందాలారబోత విషయంలో హద్దుల పరిధి విధించుకోలేదు. టూపీస్ దుస్తుల నటనకు పరాకాష్ట బిల్లా చిత్రం. అయితే అదంతా గతం. ఇప్పటి నయన్ స్థాయి వేరు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలెట్టారో.. అప్పటి నుంచి అభిమానులు ఈ బ్యూటీకి ‘లేడీసూపర్‌స్టార్’ పట్టం కట్టేశారు. అరమ్ చిత్రంతో నయనతార లెవెల్ వేరు అన్నంతగా మారిపోయింది. గతంలో ప్రేమ ఓటమి, తాజాగా ప్రియుడితో సహజీవనం వంటివి నయన్ నట జీవితానికి ఎలాంటి ఆటంకం కాలేదన్నది నిజం. కరెక్ట్‌గా చెప్పాలంటే మొదట్లో దర్శకులు శాసించినట్లు నయన్ నటించేవారు.
ఇప్పుడు ఆమె ఆదేశాలను దర్శక నిర్మాతలు పాటించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని గ్రహించిన నయన్ ఇకపై నిబంధనలు వర్తిస్తాయి అని అంటోందట. ముఖ్యంగా ఇంతకు ముందు మాదిరి హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు. ఇక ఒక పరిమితికి మించి కురుచ దుస్తులు ధరించను అని దర్శక నిర్మాతలకు కథ వినిపించినప్పుడే స్పష్టంగా చెప్తోందట. ప్రచార కార్యక్రమాలకు దూరం ఉండే పరిస్థితి ఇకపై కూడా కొనసాగుతుందని చెబుతుందట. ఇటీవల నయన్ నటించిన తెలుగు చిత్రం ‘జైసింహా’లో కూడా దుస్తులు, హీరోతో సన్నిహితంగా నటించే విషయాల్లో పరిమితులు పాటించిందట. ఇలా ఈ అమ్మడు తన చిత్ర ప్రయాణాన్ని ఇంకా ఎంతకాలం సాగించుకుంటుందో. ప్రస్తుతం చేతిలో ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. తను ఊ అంటే మరిన్ని అవకాశాలు రెడీగా ఉన్నాయట. ఇమైకానోడిగళ్, కొలైయుధీర్ కాలం, కొలమావు కోకిల, తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఆరడుగుల బుల్లెట్టు చిత్రాల్లో నయన్ ప్రస్తుతం నటిస్తోంది. ఇక అరమ్ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!







