సముద్రం లోకి జారి పడబోయిన విమానం

- January 14, 2018 , by Maagulf
సముద్రం లోకి జారి పడబోయిన విమానం

టర్కీ విమానాశ్రయం లో ఇదో ప్రమాదకరమైన, అరుదైన ఘటన ! 162 మంది ప్రయాణికులతో టర్కీ రాజధాని అంకారా నుంచి బయల్దేరిన 737-800 బోయింగ్ విమానం ట్రాబ్జాన్ ప్రాంతంలో మంచు కారణంగా స్కిడ్ అయింది. జారి నల్ల సముద్రంలో పడబోయింది. ఏటవాలుగా కింద పడిపోతూ..అదృష్టవశాత్తూ ఈ విమాన తోక భాగం బురదలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఈ విమానంలో మహిళలు, పిల్లలు కూడా చాలామంది ఉన్నారని, అందర్నీ రక్షించగలిగామని అధికారులు తెలిపారు. టర్కీ వైమానిక చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com