నాని సంక్రాంతి సర్‌ప్రైజ్
- January 14, 2018
సంక్రాంతి సందర్బంగా మీ అందరి కోసం ఓ సర్‌ప్రైజ్ రెడీ చేశానని సోషల్ మీడియా వేదికగా తెలిపిన నాని.. చెప్పినట్లుగానే సర్‌ప్రైజ్ చేసేశాడు. 'ఎంసీఏ' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఈ నాచురల్ స్టార్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంలో నటిస్తున్నాడు. భోగి రోజు కృష్ణను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదలచేస్తామని తెలిపిన నాని.. తాజాగా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ కృష్ణ లుక్‌తో కూడిన సినిమా పోస్టర్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. ఈ పోస్టర్లో నాని సీరియస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. పోస్టర్ పై కనిపించే సినిమా టైటిల్లో కూడా కేవలం కృష్ణ మాత్రమే కనిపించేలా డిజైన్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో నాని సరసన అనుపమ పరమేశ్వర్, రుక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శనివారం నాని చెప్పినట్లుగా భోగి రోజు (ఈ రోజు) కృష్ణ ఫస్ట్‌లుక్ వచ్చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సంక్రాంతి రోజు(సోమవారం) రాబోయే అర్జున్ ఫస్ట్‌లుక్, కనుమ రోజు(మంగళవారం) రాబోయే సినిమా లోని ఫస్ట్ సాంగ్ కోసం ప్రేక్షకుల్లో ఎదురు చూపులు మొదలయ్యాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







