రొయ్యల కిచిడీ
- January 15, 2018
కావల్సినవి: శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు, పసుపు - అరచెంచా, సాంబార్ పొడి - చెంచా, పచ్చిమిర్చి తరుగు - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, కొబ్బరితురుము - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, బియ్యం - రెండుకప్పులు, నానబెట్టిన పెసరపప్పు - టేబుల్‌స్పూను, మినప్పప్పు - టేబుల్‌స్పూను(నానబెట్టుకోవాలి), నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కుక్కర్‌ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్‌పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!