బ్రేక్‌ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు

- January 17, 2018 , by Maagulf
బ్రేక్‌ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు

రోజు మొత్తంలో ఉదయం చేసే బ్రేక్‌ఫా్‌స్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అది కూడా ఉదయం తొమ్మిదిన్నర లోపు చేయాలి. ఒక్కరోజు బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొట్టినా దానివల్ల ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవివ్‌ యూనివర్సిటీ, హిబ్రూ యూనివర్సిటీ అధ్యయనకారులు చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇంతకూ బ్రేక్‌ఫా్‌స్టకు అంత ప్రాధాన్యం ఎందుకంటే....

అల్పాహారం రోజంతా జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ సరిగా తీసుకుంటే అది శరీర బరువును తగ్గిస్తుంది. టైప్‌-2 డయాబెటిస్‌ వల్ల తలెత్తే సమస్యలు రాకుండా చేస్తుంది. వయసుతో వచ్చే జబ్బులను అదుపులో పెడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొట్టి ఒకేసారి బాగా తిన్నా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తరచూ బ్రేక్‌ఫాస్ట్‌ డుమ్మా కొడితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ ‘బ్రేక్‌’ ఇస్తే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు రావొచ్చు. ఉదయమే టిఫిన్‌ చేస్తే గ్లైసిమిక్‌ నియంత్రణ సరిగా ఉంటుంది. ఎండోథెలియల్‌ పనితీరు, అథిరోసిలొరోసి్‌సలను క్రమబద్ధీకరిస్తుంది. సమయానికి బ్రేక్‌ఫా్‌స్ట చేసి ఆ తర్వాత భోజనం చేయడంవల్ల శరీరంలో జీవక్రియ క్రమపద్ధతిలో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com