కజకిస్తాన్:బస్సులో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి
- January 18, 2018
మాస్కో: కజకిస్తాన్‌లో ఘోర విషాదం జరిగింది. ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 52 మంది మరణించారు. అక్టోబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 57 ప్రయాణికుల్లో కేవలం 5 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లంతా ప్రస్తుతం హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులంతా పొరుగు దేశం ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారని తెలుస్తోంది. ఏ కారణం చేత బస్సు అగ్ని ప్రమాదానికి గురైందన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







