గత ఏడాది రియాద్ లో కన్నతల్లిని చంపిన సౌదీ కవలలపై విచారణ

- January 18, 2018 , by Maagulf
గత ఏడాది రియాద్ లో కన్నతల్లిని చంపిన సౌదీ కవలలపై విచారణ

రియాద్: మతోన్మాదం ఆ కవలలను కర్కశులను చేసింది. నవమాసాలు పెంచి పోషించిన తల్లిని కత్తితో పొడిచి చంపారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ డెయిష్ లో చేరవద్దని ప్రాధేయపడటమే ఆమె చేసిన నేరమైంది. రియాద్‌లో గత ఏడాది జూన్ 24న ఈ ఘటన చోటుచేసుకున్నది. దేశంలో పెద్ద ఎత్తున యువత ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారని చెప్పడానికి ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని అక్కడి ప్రభుత్వాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలను అమితంగా గౌరవించే అరబ్ సమాజంలో కన్నకొడుకులు స్వయంగా ఓ తల్లిని చంపడంపై సర్వత్రా దిగ్భ్రాంతి నాడు వ్యక్తమైంది. కాగా, ఖాలెద్, సాలెహ్ అల్ ఒరైనీ అనే కవలలిద్దరూ ఉగ్రవాదం తప్పు ఆలా చేయకూడదని వారి భావజాలాన్ని వ్యతిరేకించినందుకు ఆ దుర్మార్గులు జన్మనిచ్చిన తల్లి 67 ఏండ్ల హైలాను స్టోర్ రూమ్ లో బంధించి  కత్తులతో పొడిచి చంపేశారు. ఇదే సమయంలో తండ్రి, అన్నపై దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. వారి చిన్న సోదరిని సైతం చంపాలని ఆ కవలలు ప్రయత్నించగా ఆమె ఒక గదిలోకి పారిపోయి తాళు వేసుకోవడం ద్వారా ప్రాణాలతో బయటపడింది. రక్త సంబంధీకులపై రక్త దాహం తీర్చుకొన్న అనంతరం ఆ నరరూప రాక్షసులు కారులో సిరియా వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు వారిని యెమెన్ సరిహద్దుల్లో బంధించారు. ఏడునెలల అనంతరం తల్లిని  చంపిన కేసులో  సౌదీ కవలలపై  ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ మంగళవారం మొదటి విచారణ సెషన్ జరిగింది. దేష్ యొక్క ఆదేశాల మేరకు  తండ్రి మరియు సోదరుడిని చంపడానికి ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదించింది.  హంతక  కవలలు, ఖలేద్ మరియు సాలే లకు వ్యతిరేకంగా మరణశిక్ష విధించామని కోరింది  .పబ్లిక్ ప్రాసిక్యూటర్ తక్ఫ్రీ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ , కంటికి కన్ను...పంటికి పన్ను ప్రకారం  ఖాలెద్, సాలెహ్ లకు భూమిపై జీవించే హక్కు లేదని వాదించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com