వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక

- January 20, 2018 , by Maagulf
వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక

దుబాయ్‌:దుబాయ్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భర్త. దుబాయ్‌ వెళ్ళేందుకు వీసా దొరక్క ఇండియాలో సతమతమవుతున్న భార్య. తన ఆవేదనను ఆ భార్య, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కి సోషల్‌ మీడియా ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తూ రావడంతో, కేంద్ర మంత్రి స్పందించడం, అత్యవసర వీసా ఆమెకు మంజూరయ్యేలా చేయడం ఇదంతా కలా? నిజమా? అని ఆ మహిళ సహా అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఆ భార్య ఆవేదన ఫలితాన్నిచ్చింది. దుబాయ్‌ వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసింది. గరిమా అనే మహిళ దుబాయ్‌లో చికిత్స పొందుతున్న తనభర్తను ఎట్టకేలకు కలిశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్యా భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. 1500 ట్వీట్స్‌ చేశాననీ, ఆ ట్వీట్స్‌పై కేంద్ర మంత్రి స్పందించడం చాలా ఆనందంగా ఉందని, కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ దుబాయ్‌ అందించిన సహకారం మరువలేనిదని గరిమా చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com