వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు కోసం దావోస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్

- January 20, 2018 , by Maagulf
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు కోసం దావోస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్

పెట్టుబడుల వేటలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. విదేశాల్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వనరులను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లో పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న కేటీఆర్‌.. తాజాగా స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఐదు రోజులపాటు పర్యటిస్తారు. జ్యూరిచ్‌ నగరానికి చేరుకున్న కేటీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు జ్యూరిచ్‌లో పలు సమావేశాల్లో ఐటీ మంత్రి పాల్గొంటారు.

రేపట్నుంచి ఈనెల 26 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు.. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రపంచంలోని వందకుపైగా దేశాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు, నిర్వాహకులు, 2500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను వారికి వివరించనున్నారు. మొత్తంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ను వేదికగా చేసుకుని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కేటీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతకు ముందు పర్యటన ముగింపు సందర్భంగా ప్రపంచంలో జపాన్‌ ఒక అద్భుతమైన దేశంగా కేటీఆర్‌ అభివర్ణించారు. అణుబాంబు దాడులను సైతం తట్టుకుని అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బృందానికి సహకరించిన జపాన్‌లోని భారత రాయబారి సుజన్‌ చినోయ్‌కి మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com