'ఒక జీవితాన్ని' కాపాడండి
- November 22, 2015
డియర్ ఫ్రెండ్స్,
నా పేరు జెస్సి రోడ్రిగ్స్. మాఅమ్మాయి- 16 సంవత్సరాల వలంకా నోరోన్హా గత 6 సంవత్సరాలుగా కిడ్నీలు పనిచేయక, ఎన్ని రకాల ట్రీట్ మెంట్ లు ఇప్పించినా ఫలితం లేక అవి క్రమంగా పాడయిపోవడం మొదలయింది. ఇక్కడ మరియు భారత్ లోని ఆసుపత్రుల మధ్య చికిత్స కోసం తిరుగుతూ తను చాలా యాతనలు పడింది. దురదృష్ట వశాత్తు, ఈ సంవత్సరం నుండి ఆమె తన ప్రాణ రక్షణ కోసం దుబాయి హాస్పిటల్ లో వారానికి మూడు సార్లు కిడ్నీ డయాలసిస్ చేయించుకోవలసి వస్తోంది. ఆమె పరిస్థితిని, వయసును దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలనీ సలహా ఇచ్చారు. ఐతే, రక్త సంబంధీకులు కాని వారినుండి కిడ్నీ తీసుకోవడానికి 60,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయి. మేము ఈ మొత్తాన్ని రుణాల ద్వారా సమకుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మరియు భారత్ మరియు దుబాయిలో ఉన్న మా స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అది మా శక్తికి మించిన మొత్తం. తన డయాలసిస్ కు అడ్డమవుతుందని ఆమె రోజుకు 1000 మిల్లి లీటర్ల (1 లీటర్) నీటిని మించి తాగరాదు. అది ఆమె ప్రాణానికే ప్రమాదం. ఆమె జీవితాంతం మందులపై ఆధారపడి జీవించవలసి ఉంది. ఆమెకు నరాల తిమ్మిర్లు, షుగర్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా షుగర్ తగ్గినపుడు ఆమె నీరసంగా, నిస్త్రాణ గా ఉంటుంది. ఈమె రోజుకు చాల తక్కువ నీటిని లేదా ఆడినా ద్రవపదార్ధాలను మాత్రమే తాగవచ్చు కనుక ఆమెకు ఎప్పుడు దాహంగానే ఉంటుంది. ఆమెకు నీటిని తాగడం అంటే మహా ఇష్టం కావడం వాళ్ళ ఆమెకు ఇది చాలాకాష్టంగా ఉంటుంది. వలెన్కా, ఆమె సోదరి వెనీషియా యు.ఎ.ఈ. లోనే పుట్టి పెరిగారు. నెనుఒక్క దాన్నే పనిచేసి నా వృద్ధులైన తల్లిదండ్రులను, నా పిల్లలను పోషించుకోవడం, ఈ దుబాయిలో చాల కష్టమైనా విషయం. ఈ కిడ్నీ మార్పిడి చాల ఖరీదైన వ్యవహారం; అందువల్ల మేము వినయపూర్వకంగా ఆర్ధిక సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దయగల హృదయంతో సహాయం చేసే మాకు చాలా ఉపయోగపడుతుందని మనవి చేస్తున్నాం. దురదృష్ట వశాత్తూ వలంకా తన ఆరోగ్య పరిస్థితి వలన పాఠశాలకు వెళ్ళలేక పోవడం వలన ఈ ,ముఖ్యమైన విద్యార్ధి దశలో తన జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే దయచేసి నన్ను సంప్రదించండి. నా ఒకే ఒక స్టాండర్డ్ చార్టర్డ్ బాంక్ అకౌంట్ నంబరు: 01-3248399-01. మీరు అందులో మొత్తాన్ని జమ చేసినట్లయితే దయచేసి నాకు తెలియజేసినట్లయితే, నేను దానిని పొందినట్టు మీకు తెలియజేయడానికి, మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవడానికి నాకు వీలవుతుంది. మీ ఈ సహాయానికి బదులుగా దేవుడు మీకు పదివేలరెట్లు తిరిగి ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
అనేక వినయపుర్వక ధన్యవాదాలతో,
మిసెస్. జెస్సీ రోడ్రిగ్స్.
0506801780
[email protected]
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







