ఏప్రిల్‌ 27నే 'నా పేరు సూర్య' విడుదల తేదీని ఖరారు చేసేశారు

- January 24, 2018 , by Maagulf
ఏప్రిల్‌ 27నే 'నా పేరు సూర్య' విడుదల తేదీని ఖరారు చేసేశారు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలపై వస్తున్న రూమర్లకు నిర్మాతలు చెక్‌ పెట్టారు. సినిమా విడుదల తేదీని మార్చినట్లు సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో నిర్మాతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్‌ 27న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అను నేను అనే సినిమాలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కూడా ఏప్రిల్‌ 27నే ఉండటంతో ఓపెనింగ్స్‌ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ను ఏప్రిల్‌ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి చిత్ర నిర్మాతలు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రం ఏప్రిల్ 27నాడే విడుదలవుతుందని వెళ్లడించారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com