ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్: 187 ఆలౌట్
- January 24, 2018
జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 187 పరుగులకు ఆలౌటైంది. పట్టుదలగా ఆడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ (30; 49 బంతుల్లో 4×4) చివరి వికెట్గా వెనుదిరిగాడు. జట్టుకు అవసరమైన విలువైన పరుగులు సాధించిన అతడిని 76.4వ బంతికి రబాడ పెవిలియన్కు పంపించాడు. ఉన్నంత సేపు సఫారీ బౌలర్ల కూటమి విసిరిన చురకత్తుల్లాంటి బంతులను భువి చక్కగా కాచుకోవడం విశేషం. బుమ్రా (0; 7 బంతుల్లో) నాటౌట్గా నిలిచాడు.
భారత జట్టులో సారథి విరాట్ కోహ్లీ (54), ఛెతేశ్వర్ పుజారా (50) అర్ధశతకాలు సాధించారు. భువిని పక్కనపెడితే మిగతా బ్యాట్స్మెన్ అంతా రెండంకెల స్కోరు సైతం చేయలేదు. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన అజింక్య రహానె (9) మోర్నీ మోర్కెల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రబాడ 3, మోర్కెల్, ఫిలాండర్, ఫెహ్లుక్వాయో తలో రెండు వికెట్లు తీశారు. ఎంగిడికి విరాట్ కోహ్లీ వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







