దావోస్‌లో కేటీఆర్ బిజీ!
- January 24, 2018
దావోస్:దావోస్‌లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంటోనీ ఫెర్నాండెజ్‌తో సమావేశమయ్యారు. అటు నొవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు అంగీకారం తెలిపారు. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయి బృందంతో సమావేశమయ్యారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, కల్పిస్తున్న వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తదితర అంశాలను వివరించారు. అటు కువైట్‌కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవోతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ముందు ఉందని అన్నారు. రాష్ట్రంలో పవర్, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







