దుబాయ్ కంపెనీకి టోకరా
- January 24, 2018
తిరువనంతపురం, జనవరి 24: కేరళలో సీపీఎంకు ఊహించని సంకటస్థితి ఎదురైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియార్ బాలకృష్ణన్ కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్ ఓ దుబాయ్ కంపెనీని రూ.13 కోట్ల టోపీ పెట్టి పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జాస్ టూరిజం-ఎల్‌ఐసీ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్న వినయ్ ఆ డబ్బు కట్టకుండా యూఏఈ నుంచి పారిపోయాడని, ఆయనపై కేసు నమోదుచేసి తన సొమ్ము ఇప్పించాలని కంపెనీ యజమానుల్లో ఒకరైన ఇస్మాయిల్ అబ్దుల్లా అల్మజూఖీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే వినయ్ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించేశానని, ఏ మాత్రం బాకీ లేనని వివరించాడు. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నీతులు వల్లించే మార్కిస్టులు ఈ అవినీతి బాగోతంపై ఏమంటారని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నించాయి.
దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







