వర్మ జీఎస్టీ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే !

- January 24, 2018 , by Maagulf
వర్మ జీఎస్టీ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే !

అమెరికా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తను తీసిన " గాడ్, సెక్స్, అండ్ ది ట్రూత్ " (జీఎస్టీ) వీడియో చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నాడు రాం గోపాల్ వర్మ. జీఎస్టీ ని నిర్మించిన అమెరికా సంస్థ స్త్రయిక్ ఫోర్స్ కంపెనీ..ఈ వీడియోను చూసినవారినుంచి చార్జీలు వసూలు చేస్తుందని వర్మ తెలిపాడు.

గాడ్ సెక్స్ ట్రూత్.ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఈ వీడియోను విడుదల చేస్తామని, దీన్ని చూడాలంటే అమెరికా, కెనడా దేశాల్లో 2.99 డాలర్లు,యూరప్ లో 1.99 పౌండ్లు, భారత్ లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాల్సి ఉంటుందంటూ నిర్మాణ కంపెనీ చేసిన ట్వీట్ ను వర్మ రీ- ట్వీట్ చేశాడు. ఈ నెల 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com