"పద్మావతి" రివ్యూ & రేటింగ్
- January 24, 2018
చిత్రం: పద్మావతి (Padmavathi)
నటీనటులు: దీపికా పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితరులు
సంగీతం: సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాత: సంజయ్ లీలా భన్సాలీ
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
కధ:
మేవార్ మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిన రాణి పద్మావతి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్తోర్ గఢ్ రాజు రతన్ సింగ్(షాహిద్ కపూర్)ను పద్మావతి (దీపికా పదుకోన్) వివాహమాడుతుంది. చిత్తోర్ గఢ్ రాజగురువు రాఘవ చేతనుడు.. పద్మావతి అపూరూప సౌందర్యాన్ని చూసి మైమరిచిపోతాడు. ఈ క్రమంలో ఆయన ఓ తప్పిదం చేస్తాడు. దీంతో ఆయనకు శిక్షగా దేశ బహిష్కరణ విధిస్తారు మహారాజు. అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్న చేతనుడు.. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ(రణవీర్ సింగ్)కి పద్మావతి సౌందర్యం గురించి వివరిస్తాడు. స్త్రీల విషయంలో కామ ధోరణిలో తప్ప మరోవిధంగా ఆలోచించలేని ఖిల్జీ.. పద్మావతిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అతి క్రూరుడైన అలావుద్దీన్ ఖిల్జీ తన సైన్యంతో చిత్తూరుపై దాడి చేసి పద్మావతిని దక్కించుకోవడానికి సిద్ధమవుతాడు. మరి ఈ రణంలో గెలుపెవరిది..? ఖిల్జీ నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం రాణి పద్మావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
రివ్యూ:
రాజపుత్రికల వీరత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాను అభినందించకుండా ఉండలేం. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఖిల్జీ పాత్రను దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ జీవించాడు. పాత్రకు తగిన విధంగా అతని ఆహార్యంతో పాటు చక్కటి నటన కనబరిచాడు. ఖిల్జీ నిజంగా ఇలానే ఉంటాడనే భావన కలిగించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో రణ్‌వీర్ హావభావాలు అద్భుతం. దీపికా పదుకోన్ పద్మావతి పాత్రలో ఒదిగిపోయింది. ఎంతో అందంగా కనిపించడంతో పాటు చక్కటి నటనతో మెప్పించింది. అప్పటి కాలానికి తగిన విధంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. ఆ కాస్ట్యూమ్స్‌లో దీపిక మునుపెన్నడూ కనిపించనంత అందంగా ఉంది. పతాక సన్నివేశాల్లో దీపిక నటన సినిమాకు ప్రాణం పోసింది. రాజపుత్రికగా రాజసం చూపిస్తూనే మరోపక్క భర్త పట్ల తన ప్రేమానురాగాలను కనబరుస్తూ సాధారణ ఇల్లాలిగా తన నటనలో తేడాలను చూపించింది. షాహిద్ కపూర్ ఒకేరకమైన హావభావాలతో కనిపించాడు. మహారాజు పాత్రలో పెద్దగా ఇమిడిపోలేదనే భావన కలుగుతుంది. అయితే ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశాడు. కానీ రణవీర్, దీపిక ముందు కాస్త తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ మూడు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది
ప్లస్ పాయింట్స్:
రణ్వీర్ సింగ్
దీపికా
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
డైలాగ్స్
సాగదీసి సన్నివేశాలు
ఎమోషన్ మిస్ అయ్యింది
చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చేసిన ఈ ప్రయోగాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే!
MaaGulf rating: 3.5/5
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి