నం.1 శత్రువు భారత్.. నం.2 మోదీ!!
- January 26, 2018
ఇస్లామాబాద్ : భారతదేశం 69వ గణతంత్ర వేడుకల్లో మునిగిపోయినవేళ.. పాకిస్తాన్ గడ్డపై నుంచి వెలువడిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. చైనా అండతో నిర్బంధం నుంచి తప్పించుకు తిరుగుతున్న మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ ఏ మొహమ్మద్.. ఇండియాను ప్రప్రధమ శత్రువుగా ప్రకటించింది.
సింధ్ రాష్ట్రంలోని లర్కానాలో జరిగిన బహిరంగ సభలో అజార్ సోదరుడు, జేషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్ ఈ విషయాలను వెల్లడించాడు. ‘హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాల’ని యువతను రెచ్చగొట్టాడు. ఒకవైపు తనను తాను ఉగ్రబాధిత దేశంగా చెప్పుకునే పాక్.. ఇలా బాహాటంగా జిహాద్‌కు పిలుపునిస్తున్న నేతలను మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుండటం గమనార్హం.
కశ్మీరీలు పిలుస్తున్నారు : ‘‘మనకు నంబర్ 1 శత్రువు ఇండియా, నంబర్ 2 మోదీ. అల్ ఖలామ్(అజార్ నేతృత్వంలో నడిచే పత్రిక) ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చేరవేయండి. భారత్‌లోని మనవాళ్లు అల్ ఖలామ్ వెబ్సైట్ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు అడ్డంకులు సృష్టిస్తూనేఉంది. కానీ కశ్మీర్లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని(పాకిస్తానీలను) పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలి’’ అని మౌలానా సైఫ్ వ్యాఖ్యానించాడు.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ సంస్థ ప్రమేయం తెలిసిందే. ఆ సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించి, నిర్బంధించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ పోరాడింది. కానీ తీర్మానం జరిగిన ప్రతిసారి వీటో చేసిన చైనా అజార్‌ను కాపాడుకుంది. ఇప్పుడు టార్గెట్ ఇండియా, మోడీలేనని సాక్షాత్తు అజార్ సోదరుడే ప్రకటించడంపై దేశాల స్పందిన వెలువడాల్సిఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







