నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా..చిరంజీవి
- January 26, 2018
నాగ శౌర్య హీరోగా తొలిసారిగా వెంకీ కుడుముల దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్న సినిమా ఛలో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... తాను ఏ పరిచయం లేని నాగశౌర్య ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడు ఏమిటి అనుకుంటున్నారా..? నన్ను కలవాలను నాగశౌర్య రెండు సార్లు మా ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను లేను. అనంతరం నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. మా ఛలో ప్రీ రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అని అడిగితే... నేను వెంటనే అంగీకరించాను. అలా అంగీకరించడానికి కారణం... నేను హీరోగా అడుగు పెట్టిన తొలి రోజుల్లో నా సినిమా శతదినోత్సవ వేడుక్కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ హీరోను అతిధిగా పిలిచాను. ఆయన నా ఫంక్షన్ కు అతిధిగా వస్తే.. ఉత్సాహం, ప్రోత్సాహం బాగుంటుంది అని భావించాను. కానీ ఆ హీరో బిజీ ఉండి రాలేక పోయారు. ఆ రోజు ఆ ఫంక్షన్ ను తూతూ మంత్రం గా జరుపుకొన్నాం.. ఆ సమయంలో నేను చాలా నిరుత్సాహ పడ్డా... అది గుర్తుకు వచ్చింది.. నాగ శౌర్య లో నన్ను నేను చూసుకున్నా.. నా లాంటి వాళ్ళు వెళ్తే తనకు ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు అందుకనే ఛలో ప్రీ రిలీజ్ వెడుక్కి వస్తా అని అన్నా.. అని తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ను ఈ వేడుకలో గుర్తు చేసుకొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







