ఎమిరేట్స్ విమానంలో తోటి ప్రయాణికులను కంగారు పెట్టిన నైజీరియా ప్రయాణికుడు
- January 27, 2018
దుబాయ్: గాల్లోనికి విమానం ఎగరడమే కొందరికి రక్తపోటు పెరగడం సహజం...కానీ ఓ నైజీరియాకు చెందిన వ్యక్తి నానా యాగీ చేశాడు...తోటి ప్రయాణికులకు పట్టపగలే విమానంలో చుక్కలు చూపించాడు. ఇటీవల దుబాయ్ నగరం నుంచి చికాగో బయలుదేరిన ఎమిరేట్స్ విమానంలో 64 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అపరిచితుడిగా మారిపోయాడు. వింత చేష్టలతో విమానమంతా కలియ తిరిగేడు. పిచ్చిపట్టిన వ్యక్తిలా బిగ్గరగా అరుస్తూ విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎవరి మాటా లెక్కచేయలేదు. అతికష్టం మీద ప్రయాణికుడిని అదుపు చేసిన సిబ్బంది విమానం చికాగో చేరుకోగానే పోలీసు అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున విమానంలో ఆ వ్యక్తి చేసిన హడావిడి అంతా వివరించారు. దీంతో ఆరోగ్య పరిస్థితుల దృష్టా హాస్పిటల్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







