పుకారు వార్తలన్నీ నమ్మవద్దు కొద్ది రోజుల్లోనే విడుదలవుతా..: సౌదీ యువరాజు తలాల్
- January 27, 2018
రియాద్: వేల కోట్లు ప్రజల సొమ్ము దిగమింగిన రాజకీయనాయకులు.. అవినీతి అధికారులకు మన దేశంలో మామూలుగానే చెరసాలలో మహారాజా వసతులతో సత్కరిస్తారు.వారికి అవసరమైన వసతులన్నీ క్షణాలలో ఏర్పాటవుతాయి. దిగమింగిన సొమ్ముని వారి నుంచి ఏమీ రాబట్టలేకపోగా ప్రభుత్వానికే ఎదురు బోలెడు డబ్బు ఖర్చవుతుంది. గల్ఫ్ దేశంలో కధ వేరుగా ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజా వంశీయులను ..సంపన్నులను బంధించి ఫైవ్ స్టార్ హోటళ్లలో మహారాజుల మాదిరిగానే చూసుకొంటూ...అవినీతి సొమ్ముని ఉగ్గుపాలతో సహా కక్కిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ మొదటి వారంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు మంత్రులు, సౌదీ రాజకుటుంబీకులు, వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన సంగతి మన అందరికి విదితమే. అక్కడ సైతం వారిని ఓ స్టార్ హోటల్‌లో ఉంచి విచారిస్తున్నారు. వారిలో 17 బిలియన్ డాలర్ల(లక్ష కోట్ల రూపాయలకు పైగానే) ఆస్తి కలిగిన, ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన అల్ వాలీద్ బిన్ తలాల్ కూడా ఉన్నారు. పలు దేశాల అధ్యక్షులతో నేరుగా మాట్లాడగలిగేంత స్థాయి ఉన్న యువరాజుని అరెస్ట్ చేయడంతో సౌదీ అరేబియాలో సంచలనం కల్గింది. అరెస్ట్ జరిగిన రెండు నెలల తర్వాత మొట్టమొదటిసారిగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ ‘నేను మరికొద్ది రోజుల్లోనే విడుదలవుతానన్న నమ్మకం ఉంది. నన్ను ఇక్కడ ఎవరూ చిత్రహింసలకు గురిచేయడం లేదు. గతంలో ఎలాంటి జీవితాన్ని అనుభవించానో ఇప్పుడు కూడా అదే విధంగా జీవిస్తున్నా. ప్రభుత్వ అధికారులకు నాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. నాపై ఇంతవరకు ఎలాంటి చార్జిషీట్ సైతం నమోదు చేయలేదు. నా నిజాయితీని నేను నిరూపించుకుంటున్నా. అధికారులకు నాపై ఉన్న సందేహాలను తీర్చుతున్నానని సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్ స్పష్టం చేశారు. తనను జైలులో నానా రకాలుగా హింసిస్తూ విచారిస్తున్నారన్న పుకారు వార్తలన్నీ అబద్ధాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వ్యాపార మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదన్నారు. కాగా 6358 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించి తన విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తలాల్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది రాజవంశీకులు ఇలా డబ్బులు చెల్లించి విడుదలయ్యారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







