రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- January 29, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని కాంతాబ్ వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, 23 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 60 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్, కాంతాబ్ వద్ద ఓవర్ టర్న్ అయ్యింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్కి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ఉన్నారు. ఒమనీ డ్రైవర్ని మినహాయిస్తే, బస్సులో ఉన్నవారంతా భారతీయ వలసదారులేనని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 19 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్బాల్ మ్యాచ్లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







