స్కూలు ఫీజు పెంపు రద్దు
- January 29, 2018మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, కింగ్డమ్లో ప్రైవేటు స్కూళ్ళు ఫీజు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, హై పెర్ఫామింగ్ స్కూల్స్‌కి ఐదు శాతం ఫీజు పెంచుకునేందుకు ఇటీవల అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. గుడ్, ఎక్స్లెంట్ రేటింగ్ ఉన్న స్కూల్స్ ఫీజు పెంచుకోవచ్చంటూ జనవరి 18న ఓ ప్రకటన వచ్చింది. అయితే తల్లిదండ్రులకు ఫీజుల పెంపు నుంచి ఊరటనిస్తూ కింగ్ హమాద్, పీజు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నౌమి, కింగ్ హమాద్ ఆదేశాలతో స్కూళ్ళు ఫీజు పెంపు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని సూచించారు. ఒకవేళ ఫీజు పెంచే ఆలోచనతో విద్యా సంస్థలు ఉంటే, వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని మినిస్ట్రీ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. బహ్రెయిన్‌లో 73 ప్రైవేట్ ఓన్డ్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. వాటిల్లో 14 స్కూళ్ళకు హై పెర్ఫామెన్స్ రేటింగ్ ఉంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







