వలసదారుల లైసెన్స్‌ రెండేళ్ళకోసారి రెన్యువల్‌ తప్పనిసరి

- January 29, 2018 , by Maagulf
వలసదారుల లైసెన్స్‌ రెండేళ్ళకోసారి రెన్యువల్‌ తప్పనిసరి

మస్కట్‌: వలసదారులు ఇకపై తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ని రెండేళ్ళకోసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా వలసదారుల లైసెన్స్‌ పదేళ్ళపాటు చెల్లుబాటయ్యేది. ఒక్కసారి లైసెన్స్‌ వస్తే, మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ లైసెన్స్‌ని రెన్యువల్‌ చేసుకోవాల్సి వచ్చేది. అయితే తాజాగా రాయల్‌ ఒమన్‌ పోలీసులు, ట్రాఫిక్‌ రూల్స్‌కి సంబంధించి తీసుకున్న సరికొత్త చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఈ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com