ఫిబ్రవరి 2 న హిందీ సినీ నేపధ్య గాయకుడు అమిత్ కుమార్ "యాద్ ఆ రాహి హై"
- January 29, 2018
కువైట్ : ప్రముఖ హిందీ సినీ నేపధ్య గాయకుడు, నటుడు , సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ తనయుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అమిత్ కుమార్ మరియు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహ థాకుర్తా కలిసి "యాద్ ఆ రాహి హై" అనే సంగీత విభావరి లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 :30 గంటలకు కువైట్ లో అనేక విజయవంతమైన ప్రోగ్రాంలు నిర్వహించిన ఇండియన్ కల్చరల్ సొసైటీ పయనీర్ అఫ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరగనున్న ఈ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ బ్యాండ్ సర్గమ్ స్టార్స్ , సహ గాయకుడు సైరా ఖాన్ మరియు కడుపుబ్బనవ్వించే హాస్యనటుడు రాజీవ్ మల్హోత్రాలు పాల్గొననున్నారు. శుక్రవారం 2 వ తేదీ ఫిబ్రవరి న 6.30 గంటలకు అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం మైదాన్ హావాలి వద్ద పోలీసు స్టేషన్ సమీపంలో జరగనుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: ఇమెయిల్ [email protected] www.icskuwait.org ఫోన్ నంబర్లు -97984603 - 65852425 - 60656546- 66550065 వాట్'స్ అనువర్తనం: 66615050- 97653441- 99709495
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







