64 కేజీల అతిపెద్ద బంగారు ఉంగరంలో 5.1 కేజీల విలువైన వజ్రాలు

- January 29, 2018 , by Maagulf
64 కేజీల అతిపెద్ద బంగారు ఉంగరంలో 5.1 కేజీల విలువైన వజ్రాలు

షార్జా:  పుచ్చకాయ అంతటి అతిపెద్ద ఉంగరం. బరువు అక్షరాలా 64 కేజీలు మాత్రమే .ప్రపంచంలోనే అతిపెద్ద్  ఈ ఉంగరం పేరు 21 క్యారట్ నజ్మత్ తైబా మరో  పేరు స్టార్ ఆఫ్ తైబా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉంగరమని గిన్నీస్ బుక్ ఆఫ్  రికార్డుల్లో స్థానం ఇచ్చింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న జ్యూయలరీ వ్యాపార సంస్థ తైబాకు చెందిన ఉంగరం ఇది. 64 కేజీల బరువున్న ఈ ఉంగరాన్ని 5.1 కేజీల విలువైన వజ్రాలు, ఖరీదైన రంగురాళ్లతో అలంకరించారు. 2000 సంవత్సరంలో 55 మంది స్వర్ణకారులు 45 రోజుల్లో 450 గంటలపాటు కష్టపడి తయారు చేశారు. ఈ వజ్రాన్ని తయారు చేయించిన వ్యక్తికి అప్పట్లో రూ. 3 కోట్ల 47 లక్షలకు ఈ ఉంగరం కోసం వెచ్చించాడు. ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.19 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఈ ఉంగరాన్ని షార్జా నగరంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శనకు ఉంచారు. రానున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా షార్జాలోని ఎవరైనా ఎన్నారైలూ వీలైతే కొనుక్కోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com