దుబాయ్‌లో కొత్త మిలియనీర్ ఓ ఇండియన్ టీచర్
- January 29, 2018
ఓ యాన్యువల్ డ్రా ఓ ఇండియన్ టీచర్ని బిలియనీర్‌గా మార్చేసింది. యూఏఈలో 19 ఏళ్ళ నుంచి టీచర్‌గా పనిచేస్తోన్న భారతీయ మహిళ అమృత జోషి, తన పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కమర్షియల్ బ్యాంక్‌లో సేవింగ్స్ చేస్తున్నారు. ఆ కమర్షియల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ యాన్యువల్ డ్రాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా 1 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. దాంతో ఆమె యూఏఈలో సరికొత్త మిలియనీర్‌గా అవతరించారు. బంపర్ డ్రాలో తాను 1 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్న విషయం గురించి సమాచారం అందుకున్న ఆమె, ఆ అనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నట్లు చెప్పారు. ఈ సొమ్ముతో, తన పిల్లలకు ఇంకా మెరుగైన విద్య, జీవనం అందించగలుగుతానని ఆమె అన్నారు. దుబాయ్‌కి చెందిన అల్యూమినియం ఫ్యాక్టరీ కార్మికుడు జహిర్ల్ ఇస్లామ్ కబీర్, డిసెంబర్లో జరిగిన డ్రాలో 100,000 దిర్హామ్‌లు గెల్చుకున్నారు. ఈ బహుమతి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో దీని విలువ 2 మిలియన్ బంగ్లాదేశీ టాకాలతో సమానమని ఆయన అన్నారు. తమ బ్యాంకు వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారనీ, వారిని మరింత సంతోషపరిచేందుకు ఈ తరహా డ్రాలు నిర్వహిస్తున్నామని రిటెయిల్ బ్యాంక్ గ్రూప్ హెడ్ షకెర్ జైనాల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







