హాట్ కేక్ గా మారిన శ్రీదేవి తనయ
- January 30, 2018
అందాల నటి శ్రీదేవి కూతుర జాహ్నవి తొలి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు కానీ... ఆమెను తమ తమ సినిమాల్లో నటింపజేసుకోవడానికి దర్శక, నిర్మాతలు పోటీలు పడుతున్నారు. అందాల తార శ్రీదేవి కూతురిగా క్రేజ్ వున్న జాన్వీ కపూర్ శ్రీదేవి తనయ కావటం,, పైగా అందగత్తె కావటంతో ఆమె గురించి బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు ఇప్పట్నుంచే వెయిట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ సినీ ఎంట్రీ గురించి చాలా మంది చాన్నాళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. 'దఢక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ. హిట్టైన మరాఠా సినిమా 'సైరత్'కు రీమేక్ గా ఇది రూపొందుతోంది.
పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆసక్తితో ఎదురుచూస్తోంది. శ్రీదేవి తనయ తెరపై ఎలా కనిపిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆ సినిమా విడుదల కాకున్నా, జాన్వీకి మాత్రం తదుపరి సినిమా ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఆమెను తమ సినిమాల్లో నటింపజేసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
వారిలో ముందు నిలుస్తున్నాడు.. జాన్వీని ఇంట్రడ్యూస్ చేస్తున్న నిర్మాత కరణ్ జొహర్. 'దఢక్' నిర్మాత అయిన కరన్ బాలీవుడ్ లో 'టెంపర్' సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్లో రణ్ వీర్ హీరోగా కనిపిస్తున్నాడు. 'సింబా' అనే టైటిల్ కూడా ప్రకటించారు. తెలుగులో కాజల్ చేసిన హీరోయిన్ పాత్రను జాన్వీ చేత చేయించాలని కరణ్ అనుకుంటున్నాడట. ఈ మేరకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం.
అలాగే పలువురు బాలీవుడ్ మూవీ మేకర్లు కూడా జాన్వీని తమ తమ సినిమాల్లో నటింపజేయడానికి శ్రీదేవి, బోనీ కపూర్లను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో కొందరు తమిళ, తెలుగు మూవీ మేకర్లు కూడా ఉన్నారని సమాచారం.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







