రవితేజ న్యూఫిల్మ్ 'అ.. అ.. ఆ'
- January 30, 2018
'టచ్ చేసి చూడు' రిలీజ్‌కి దగ్గర పడడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు రవితేజ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ జరగనుంది. దీనికి 'అమర్- అక్బర్- ఆంథోనీ' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజా నటించబోతున్నాడు.
ఇక చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో చేయనున్నారు. మాస్ మహారాజా పక్కన హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. లోబడ్జెట్‌లో చేయాలని భావిస్తున్న డైరెక్టర్.. కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







