హజ్ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ
- January 30, 2018
అమరావతి : హజ్ యాత్రికులు మొదటి విడత 81 వేల రూపాయలు చెల్లింపునకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు పెంచుతూ సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ అలీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31వ తేదీన మొదటి విడత చెల్లించడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హజ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హజ్ యాత్రికుడు 81 వేల రూపాయలు బ్యాంక్‌లో జమ చేసినట్లు ఒరిజినల్ బ్యాంక్ పే ఇన్ స్లిప్, మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాస్‌పోర్ట్, వైట్ బ్యాగ్‌గ్రౌండ్ కలర్ ఫొటోలను విజయవాడలోని ఎపి స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో వెంటనే అందజేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







