అంగవైకల్యం గల కన్నకూతురిని అంతమొందించిన తల్లి
- February 01, 2018
కువైట్: ఓ కామాంధురాలు కన్న కుమార్తె పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడి సహకారంతో ఆ బాలికను ఓ భవనం మీద నుంచి కిందికి తోసేసింది. గతంలోనే ఆ నిందితురాలు భర్త నుంచి విడాకులు పొందింది. అంగవైకల్యంతో బాధపడుతున్న కూతురిని తన వద్దే పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఒక వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోంది. వీరిద్దరి ఇద్దరికీ అడ్డుగా ఉంటోందనే భావనతో కూతురిని చిత్రహింసలకు గురిచేశారు. తన కూతురు భవనం పైనుంచి జారి పడిందని నిందితురాలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మృతదేహంపై తీవ్రమైన గాయాలు, ఓ చేతిపై కాలిన గుర్తులు ఉండడంతో శవాన్ని తీసుకెళ్లకుండా ఫోరెన్సిక్ అధికారులను ఘటనాస్థలానికి రావాల్సిందిగా కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ రాక్షస తల్లికి ఆమె ప్రియుడికి ఇద్దరికీ ఉరిశిక్ష విధిస్తున్నామని తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







