కొత్త బస్‌ రూట్‌ని ప్రకటించిన మవసలాట్‌

- February 02, 2018 , by Maagulf
కొత్త బస్‌ రూట్‌ని ప్రకటించిన మవసలాట్‌

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలాట్‌), మస్కట్‌ నుంచి ముసాన్నాకి బార్కా మీదుగా కొత్త పబ్లిక్‌ బస్‌ రూట్‌ని ప్రకటించింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ బస్‌ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ బస్సులు సేవల్ని అందిస్తాయి. కొత్త బస్‌ రూట్‌ 42, సౌత్‌ అల్‌ బతినా గవర్నరేట్‌కి సేవలు అందిస్తుంది. సుల్తానేట్‌లో ఎక్కువమంది టూరిస్టులకు ఈ రూట్‌ అవసరమవుతుంది. మిలీనియం రిసార్ట్‌ సహా పలు పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. వారందరికీ కొత్త బస్‌ రూట్‌ ఉపయుక్తంగా ఉంటుందని మవసలాట్‌ ప్రతినిథులు పేర్కొన్నారు. కొత్త రూట్‌ ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందని మవసలాట్‌ పేర్కొనగా, బస్‌ రూట్‌తో తమకు సౌకర్యంగా ఉంటుందని ప్రయాణీకులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com