ప్రవాసీయులు ఇకపై ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్‌ను రెస్యూల్ చేసుకోవాలి

- February 02, 2018 , by Maagulf
ప్రవాసీయులు ఇకపై ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్‌ను రెస్యూల్ చేసుకోవాలి

మస్కట్ : ఒక ఊరి కరణం...మరో ఊరిలో వెట్టి గా  జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకొనివెళ్ళినవారికి గంటకో గమనిక ...నిమిషానికో నిబంధన  గల్ఫ్ దేశాలలో చాలా  సర్వసాధారణమైపోయింది. ఒమన్ దేశం ప్రస్తుతం ఓ నిబంధనను ఏర్పరిచింది. దీని ప్రకారం  ఒమన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్న ప్రవాసీయులు  ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్‌ను రెస్యూల్ చేసుకోవాల్సి  ఉంటుంది. వచ్చే నెల మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దేశ ట్రాఫిక్ చట్టాల సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఉన్న నిబంధన ప్రకారమైతే ప్రవాసీయులు  ప్రతి 10 ఏళ్లకుమారు తమ లైసెన్స్‌ను ఓమారు పునరుద్ధరించుకోవాలి. పాత నిబంధనపై ప్రస్తుతం లైసెన్స్ కలిగివున్న వ్యక్తులకు ఇబ్బంది లేదని, ప్రస్తుతమున్న లైసెన్స్ గడువుకాలం ముగిసిన అనంతరం ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com