రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

- February 02, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

రస్‌ అల్‌ ఖైమాలో ఓ ట్యాక్సీకి జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అల్‌ ఘయిల్‌ ప్రాంతంలోని అంతర్గత రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అహ్మద్‌ అల్‌ సామ్‌ అల్‌ నక్బి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు మృతి చెందారని చెప్పారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి ట్రాఫిక్‌ పెట్రోల్‌తోపాటుగా అంబులెన్స్‌, పారా మెడిక్స్‌ మరియు రెస్క్యూ టీమ్స్‌ చేరుకున్నాయి. డ్రైవర్‌ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గురైన కారుని తొలగించి, ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com