పాస్‌పోర్టు కార్యాలయంలో 140 ఉద్యోగాలకు..1లక్ష 7 వేల మంది సౌదీ మహిళలు పోటీ పడుతున్నారు

- February 02, 2018 , by Maagulf
పాస్‌పోర్టు కార్యాలయంలో 140 ఉద్యోగాలకు..1లక్ష 7 వేల మంది సౌదీ మహిళలు పోటీ పడుతున్నారు

సౌదీఅరేబియా : చమురు ఉత్పత్తి చేసే దేశంలో నిరుద్యోగం చాప కింద పెట్రోల్ మాదిరిగా వ్యాపిస్తుంది. బహుశా అందుకే స్థానికరణ పేరుతో ఉద్యోగకల్పన తొలుత తమ దేశంలోని నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొంటున్నారు.  గత సంవత్సరం ప్రభుత్వం మహిళలకు ఒంటరిగా వాహనాలు నడిపే స్వేచ్ఛను ..స్టేడియం లో క్రీడలను నేరుగా తిలకించే అవకాశం ఆయన సౌదీ మహిళకు కల్పించారు. మహిళాసాధికారిత దిశలో ప్రిన్స్ సల్మాన్ పలువురు మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకొని తమ కాళ్ళ పై తామే నిలబడాలని ఆయన కోరుకొంటున్నారు. ఇటీవల పాస్‌పోర్టు కార్యాలయంలో 140 ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన వెలువడింది. ఉద్యోగ అవకాశం ఎదురుచూస్తున్న సౌదీ మహిళలు ఈ ఉద్యోగాలను పొందాలని ఆశపడ్డారు. కేవలం ఏడు రోజుల్లో...ఒక లక్షా  ఏడు వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకోవడంతో సౌదీ అరేబియాలో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com