భానుప్రియ మాజీ భర్త మృతి

- February 03, 2018 , by Maagulf
భానుప్రియ మాజీ భర్త మృతి

వంశీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన ఒకప్పటి అందాలనటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాద సంఘటన చోటుచేసుకొంది. ఆమె మాజీ భర్త ఆదర్శ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతి చెందారు. భర్త మరణవార్త విన్నవెంటనే భానుప్రియ తన కుమార్తెను తీసుకొని అమెరికా బయలుదేరి వెళ్లారు. 

1998 జూన్‌లో కాలిఫోర్నియాలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో భానుప్రియ, ఆదర్శ కౌశల్‌ల వివాహం జరిగింది. ఆదర్శ కౌశల్‌ ఒక ఫొటోగ్రాఫర్. వీరిదాంపత్యానికి గుర్తుగా.. 2003 ఒక పాప పుట్టింది. దంపతులిద్దరికీ కళారంగం పట్ల అభిమానం ఉండడంతో.. కుమార్తెకు అభినయ అనే పేరు పెట్టుకున్నారు. కుమార్తె పుట్టిన రెండేళ్లకే 2005 లో వీరువిడాకులు తీసుకున్నారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన భానుప్రియ తన కుమార్తెతో కలిసి చెన్నైలో ఉంటున్నారు. కూచిపూడి, భరతనాట్యం 
లో శిక్షణ ఇస్తున్నారు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com