టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఔదార్యం
- February 06, 2018
నిజామాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనలో ఉన్న సేవాగుణాన్ని మరోసారి చాటిచెప్పారు. సర్పంచ్ పదవిలో ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందిన మోచి బాలరాజు కుటుంబానికి ఆమె అండగా నిలిచారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అన్నీ తానై ఎంపీ కవిత చూసుకుంటున్నారు. దివంగత సర్పంచ్ కుమార్తె భారతి పెళ్లికి కవిత ఆర్థిక సాయం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలోని బినోల గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ మోచి బాలరాజు ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి 2016, మార్చి 12న మృతి చెందాడు. నాడు.. మోచి బాలరాజు అంత్యక్రియల ఖర్చును కవిత భరించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. బాలరాజు కుమార్తె భారతికి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఔట్ సోర్సింగ్ కింద జాబ్ ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్నారు. ఇక భారతి వివాహం మార్చి నెలలో ఉండటంతో.. పెళ్లి ఖర్చుల కోసమని కవిత రూ.
3 లక్షల నగదును ఇచ్చారు. ఈ నగదును టీఆర్ఎస్ అధికారులు.. భారతికి ఇవాళ అందజేశారు. ఎంపీ కవితకు రుణపడి ఉంటామని భారతి, ఆమె తల్లి ఉద్వేగానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి