శ్రీనగర్‌లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి
- February 06, 2018
తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది ఒకరు మృతి చెందారు.
పోలీసులు ఇవాళ శ్రీనగర్‌లోని పోలీస్ స్టేషన్ నుంచి చికిత్స నిమిత్తం ఒక పాకిస్తానీ తీవ్రవాదిని ఎస్ఎమ్‌హెచ్‌ఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు జమ్మూకాశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ భట్ స్థానిక జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్‌కు తెలిపారు.
ఆ సందర్భంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పాకిస్తానీ తీవ్రవాదికి రక్షణగా ఉన్నవారిపై దాడి చేశారని వివరించారు.
‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు.ఈ దాడిలో నావేద్ జాట్ అనే పాకిస్తాన్ తీవ్రవాది తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. జాట్ గత ఏడాది దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పట్టుబడ్డాడు.
దాడి నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







