మార్చి 22న 'మదర్ ఆఫ్ ది నేషన్' ఫెస్టివల్
- February 08, 2018
మార్చి 22 నుంచి 31 మార్చి వరకు 'మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్' జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం - అబుదాబీ ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. మూడో ఎడిషన్‌ని మరింత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఈ వెంట్ అబుదాబీలోని కోర్నిచ్‌లో జరుగుతుంది. గత ఏడాది ఫెస్టివల్ 197,000 మంది సందర్శకుల్ని పది రోజుల్లో అలరించింది. మదర్ ఆఫ్ నేషన్ ఫెస్టివల్ జనరల్ విమెన్స్ యూనియన్ ఛైర్ విమెన్, ప్రెసిడెంట్ ఆఫ్ స్పుఈం కౌన్సిల్ ఫర్ మదర్ హుడ్ అండ్ చైల్డ్ హుడ్, సుప్రీం చైర్ విమెన్ ఆఫ్ ది ఫ్యామిలీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ షేకా ఫాతిమా బింట్ ముబారక్‌కి ఈ మదర్ ఆఫ్ ది నేషనల్ ఫెస్టివల్ అంకితం చేస్తున్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉండేలా పలు కార్యక్రమాలు ఈ ఫెస్టివల్‌లో ్పధాన ఆకర్షణ కానున్నాయి. అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం డైరెక్టర్ సైఫ్ సయీద్ ఘోబాష్ మాట్లాడుతూ, షేకా ఫాతిమా సాధించిన విజయాల్ని గుర్తు చేసుకోవడం, అలాగే ఆమె విజన్‌ని అమలు చేయడమే కాకుండా, సమాజానికి ఆమె ఇస్తున్న సందేశానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







