యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్: సూరి
- February 07, 2018
శనివారం భారత ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి రాబోతున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అక్కడ జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌కి గౌరవ అతిథిగా హాజరు కాబోతున్నారు. కమ్యూనిటీ మెంబర్స్, బిజినెస్‌మెన్‌తోనూ సమావేశమవుతారు. అలాగే వీడియో లింక్ ద్వారా దుబాయ్‌లో తొలి హిందూ టెంపుల్‌కి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్రమోడీ. యూఏఈలో ఇండియా రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఈ టెంపుల్, యూఏఈ సహనానికి ప్రతీక అనీ, యూఏఈలో ఇండియన్ కల్చర్‌కి ప్రతీక అనీ చెప్పారు. యూఏఈ వార్ మెమోరియల్ వాహత్ అల్ కరామా వద్ద నివాళులర్పించనున్నారు మోడీ. యూఏఈలో తొలి హిందూ దేవాలయానికి అనుమతినిచ్చినందుకు యూఏఈ రూలర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతోంది యూఏఈలోని హిందూ సమాజం. అలాగే యూఏఈలో ఇండియా రాయబారి సూరి, యూఏఈ నాయకత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







