గుర్తు తెలియని గృహ సేవకురాలు మృతదేహం ఒక అపార్ట్ మెంట్ ఫ్రీజర్ లో లభ్యం

- February 08, 2018 , by Maagulf
గుర్తు తెలియని గృహ సేవకురాలు మృతదేహం ఒక అపార్ట్ మెంట్  ఫ్రీజర్ లో లభ్యం

కువైట్ : బతుకుతెరువు కోసం పరాయి దేశం వెళ్లిన కొందరు మహిళలు ఆచూకీ లేకుండా పోతున్నారు. ముఖ్యంగా పని మనుషులు యజమానులు నిర్దయకు గురై నిండు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. బుధవారం పోలీసులు  గుర్తు తెలియని ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలు మృతదేహంను ఒక అపార్ట్ మెంట్ ఫ్రీజర్ లో కనుగొన్నారు. కోర్టు ఉత్తర్వుల జారీ చేసిన తర్వాత సల్మియాలో పోలీసులు ఫ్లాట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ మహిళ మృతదేహం కనుగొనబడింది. నవంబర్ 2016 లో ఈ ఫ్లాట్ లో అద్దెకున్నవారు కువైట్ ను విడిచిపెట్టిన తర్వాత ఆ అపార్ట్మెంట్ మూసివేయబడింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం, హత్యకు గురైన స్త్రీ మెడపై ప్రాణాంతక కత్తిపోట్లు వివిధ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు   కనిపించాయి. కాగా ఈ అపార్ట్మెంట్ యజమానులను గుర్తించారు. ఈ కేసులో లెబనీస్ వ్యక్తి మరియు అతని సిరియన్ భార్య ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్ గృహ సేవకురాల గుర్తింపు ఇంకా అస్పష్టంగానే ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com