తండ్రి రూపం చూసి కంట తడి పెట్టిన సౌదీ ప్రిన్స్ సల్మాన్

- February 10, 2018 , by Maagulf
తండ్రి రూపం చూసి కంట తడి పెట్టిన సౌదీ  ప్రిన్స్ సల్మాన్

సౌదీఅరేబియా : రాజులైతే మాత్రం రాగద్వేషాలకు మినహాయింపు కాదు. హోలో గ్రామ్ అనే టెక్నాలజీ ద్వారా   స్టేజ్ మీద తన తండ్రి  బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రూపం చూసి సౌదీ ప్రిన్స్ సల్మాన్ ఒక్కసారిగా భావోద్వాగానికి లోనయ్యారు. చనిపోయిన తన తండ్రిని ఆ రంగస్థలంపై  ప్రత్యక్షమవడంతో ఆయనకు దుఃఖం ఆగలేదు కన్నీళ్లు పెట్టుకున్నారు. రియాద్ సమీపంలో జనాద్రియ గ్రామంలో  వారసత్వం సాంస్కృతిని ప్రతిభింబించే 32 వ జాతీయ ఉత్సవం ఈ ఘటన 32వ అల్ జనరియా ఫెస్టివల్‌లో జరిగింది. ఆయన ఆ ఫెస్టివల్‌కు యువరాజుతో కలిసి హజరయ్యారు. ఫెస్టివల్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమాలు జరుగుతుండగా మధ్యలో ప్రస్తుత రాజు సల్మాన్ తండ్రి  ఖలీద్ అబ్దుల్ అజీజ్ ప్రసంగాన్ని హోలోగ్రామ్ ద్వారా నిర్వాహకులు వినిపించారు. ఆయన నేరుగా స్టేజీపై నిలబడి ప్రసంగించినట్లుగా అనిపించడంతో రాజు సల్మాన్ భావొద్వేగాన్ని ఆపుకోలేకపోయారని నిర్వాహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com