రిఫ్ఫాలో ఆక్రమణల తొలగింపు

- February 10, 2018 , by Maagulf
రిఫ్ఫాలో ఆక్రమణల తొలగింపు

మనామా: సదరన్‌ ఏరియా మునిసిపాలిటీ, సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌తో కలిసి, రిఫ్ఫాలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల్ని తొలగించాయి. 15 వరకు ఆక్రమణల్ని ఫర్నిచర్‌ షాప్స్‌కి సంబంధించి తొలగించడం జరిగింది. బ్లాక్‌ 903లోని ఈ ఫర్నిచర్‌ షాప్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు ఛైర్స్‌, బెడ్స్‌, రిఫ్రిజిరేటర్స్‌, వాషింగ్‌ మెషీన్స్‌, ఇతర ఫర్నిచర్‌ని నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుని ఆక్రమించి ప్రదర్శనకు పెట్టారు షాప్‌ ఓనర్స్‌. వీరిలో కొందరికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. నోటీసు తర్వాత కూడా స్పందించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ తరహా ఆక్రమణల తొలగింపుకి సంబంధించి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందని మునిసిపాలిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com