షార్జాలో 41 ఏళ్ళ భారతీయ మహిళ మృతి
- February 10, 2018
షార్జాలో ఓ మహిళ భవనం పైనుంచి పడి మృతి చెందింది. మృతురాల్ని భారతీయ మహిళగా గుర్తించారు. అల్ కాసిమియా ప్రాంతలోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి 41 ఏళ్ళ మహిళ కింద పడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాల్ని పి.థామస్‌గా తేల్చారు. సంఘటనా స్థలంలోనే థామస్ మృతి చెందారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ ఆపరేషన్స్ రూమ్ ఈ సంఘటన గురించి సమాచారం అందుకుంది. వెంటనే పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయి. ఫోరెన్సిక్, సీఐడీ, రెస్క్యూ యూనిట్, క్రైమ్ సీన్ డిపార్ట్‌మెంట్స్ సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ రక్తపు మడుగులో థామస్ మృతి చెంది కన్పించింది. పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. మృతురాలి సన్నిహితులతో పోలీసులు మాట్లాడి, ఆమె మృతికి కారణాల్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తూ పడిపోయిందా? అనే విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







